Published : 14/12/2020 01:53 IST

ఆ ఒక్క కుటుంబమే బాగుపడింది: డీకే అరుణ

హైదరాబాద్: రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందితే జుట్టు.. లేకపోతే కాళ్లు అనేలా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన తెరాస, కాంగ్రెస్‌ సర్పంచులు, మండల, గ్రామ కమిటీల అధ్యక్షులు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డీకే అరుణ సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు ఇవాళ భాజపా వైపు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబ పాలన అంతం చేసేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారన్నారు. ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్‌ పక్కనబెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

‘‘తెలంగాణ ఏర్పడిన తరువాత కల్వకుంట్ల కుటుంబం తప్ప మరెవరూ బాగుపడలేదు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కేటాయించలేదు. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు అప్పులు చేసి పనులు చేస్తే కనీసం ఆ బిల్లులు చెల్లించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రధాని మోదీ నాయకత్వంలో సర్పంచులందరూ గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా ముందుకు సాగాలి’’ అని డీకే అరుణ అన్నారు.

 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్