బీసీల ప్రయోజనాలు మజ్లిస్‌కు తాకట్టు:లక్ష్మణ్‌

కేసీఆర్‌ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలను అణచివేస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం...

Published : 12 Nov 2020 01:21 IST

హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలను అణచివేస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు సముచితస్థానం కల్పించాలన్నారు. భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నాగోల్‌లో నిర్వహించిన ‘తెలంగాణ బీసీ గోస’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంబీసీలకు రూ.10వేల కోట్లు కేటాయించామన్న తెరాస ప్రభుత్వం.. రూ.కోటి కూడా ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీసీల ప్రయోజనాలను మజ్లిస్‌ వద్ద కేసీఆర్‌ తాకట్టు పెడుతున్నారని లక్ష్మణ్‌ మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ను 33 నుంచి 22 శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని ఆరోపించారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస, మజ్లిస్‌ను మట్టికరిపించి భాజపాను గెలిపించాలని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ పేదల జోలికి వస్తే ఎలా ఉంటుందో దుబ్బాక ప్రజలు తెరాస ప్రభుత్వానికి చూపించారన్నారు. బీసీలపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉంటే తెరాస అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్‌ చేశారు. దుబ్బాక ప్రజల స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని సంజయ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని