‘తెరాస యాక్షన్ బట్టే భాజపా రియాక్షన్’
మౌలాలి డివిజన్ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని భాజపా ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. దమ్ముంటే...
భాజపా ఎమ్మెల్యే రఘునందన్ వ్యాఖ్య
హైదరాబాద్: కేంద్రం ఏం ఇచ్చిందని అంటున్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌కు మీరేం చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్, కేటీఆర్‌లకు లేదన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను హిందూ ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దన్నారు. సెక్యులర్ అనే పదానికి అర్థం కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు. తెరాస యాక్షన్ బట్టే.. భాజపా రియాక్షన్ ఉంటుందని రఘునందన్ వ్యాఖ్యానించారు.
మౌలాలి అభివృద్ధికి ఏం చేశారు?
అంతకుముందు మౌలాలిలో భాజపా అభ్యర్థి సునీతా చంద్రశేఖర్ యాదవ్‌కు మద్దతుగా రఘునందన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ మౌలాలి డివిజన్ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే మౌలాలి వచ్చి చేసిన అభివృద్ధిని చూపించాలని మంత్రి కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన బాలిక సుమేధ హత్యకు బాధ్యత వహించాలని.. ఆమె కుటుంబసభ్యులకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సామాన్యుల ఇళ్లకు రూ.వేలల్లో పన్నులు వేస్తుంటే మౌలాలి తెరాస కార్పొరేటర్ ఇంటికి రూ.101 మాత్రమే పన్నువేశారని ఆరోపించారు. ఇది న్యాయమా?నగరాన్ని జలగల్లా పీడించింది తెరాస కార్పొరేటర్లు కాదా? అని రఘునందన్ ప్రశ్నించారు. తెరాస పాలనలో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? అని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి శుక్రవారం చేపట్టాల్సిన నిరసన కార్యక్రమం వాయిదా పడింది. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్‌కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్‌ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్‌లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!