గ్రేటర్‌లోనూ దుబ్బాక ఫలితమే:రఘునందన్‌

నూటికి నూరు శాతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దుబ్బాక ప్రభావం ఉంటుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

Updated : 17 Nov 2020 12:47 IST

హైదరాబాద్‌: నూటికి నూరు శాతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దుబ్బాక ప్రభావం ఉంటుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. దుబ్బాక ఫలితమే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్‌ ద ప్రెస్‌లో రఘునందన్‌ మాట్లాడారు. ఉపఎన్నిక సమయంలో తమపై పెట్టిన కేసులను న్యాయస్థానంలో గెలుస్తామని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడితే ఆలస్యంగానైనా విజయం దక్కుతుందని తన విషయంలో నిరూపితమైందన్నారు. 

తన కోసం పోరాడిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు రఘునందన్‌ చెప్పారు. తెరాసలో సుమారు 30 నుంచి 40మంది నాయకులు అసంతృప్తులుగా ఉన్నారని.. వారందరూ భాజపాలోకి రావాలని ఆహ్వానించారు. గ్రేటర్‌లో వరద సాయం పూర్తిగా ఎన్నికల కోసం పంపిణీ చేసిన డబ్బుగానే పరిగణిస్తున్నామన్నారు. హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. పదవులు ఉన్నా లేకున్నా ఒకేలా పనిచేస్తానని.. జీవితాంతం భాజపాలోనే కొనసాగనున్నట్లు రఘునందన్‌రావు స్పష్టం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని