ఎంపీగా తొలి ఏడాది గంభీర్‌ ‘రిపోర్ట్‌ కార్డ్‌’

భాజపా తరఫున లోక్‌సభ సభ్యుడిగా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎన్నికై  మే నాటికి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఎంపీగా తన తూర్పు దిల్లీ నియోజకవర్గ ప్రజల కోసం సంవత్సరంలో...

Updated : 10 Oct 2020 14:43 IST

విడుదల చేసిన భాజపా ఎంపీ, మాజీ క్రికెటర్‌

దిల్లీ: భాజపా తరఫున లోక్‌సభ సభ్యుడిగా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎన్నికై  మే నాటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఎంపీగా తన తూర్పు దిల్లీ నియోజకవర్గ ప్రజల కోసం సంవత్సరంలో చేసిన పనుల ‘రిపోర్ట్‌ కార్డ్‌’ను గంభీర్‌ విడుదల చేశారు. స్మాగ్‌ టవర్‌ ఏర్పాటుతోపాటు ఘాజీపూర్ వద్ద భూమి ఎత్తును తగ్గించడం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అందులో ఉటంకించారు. ప్రజల కోసం తాను చేసిన అభివృద్ధి పనుల గురించి వారికి తెలియజేయడం తన బాధ్యతగా గంభీర్‌ పేర్కొన్నారు. 

గౌతం గంభీర్‌ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి తన జీతభత్యాలను ప్రజల కోసం ఖర్చు చేస్తూనే ఉన్నారు. పార్కులు, శ్మశాన వాటికలు, విశ్రాంతి గదులను కొత్తగా నిర్మించేందుకు, ఉన్నవాటిని బాగు చేయించేందుకు పూర్తి వేతనాన్ని వెచ్చించేవారని ఎంపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్‌డౌన్‌ సందర్భంగా ఐదు లక్షల ఆహార పొట్లాలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా 2 లక్షల ఆహార ప్యాకెట్లు, 40 వేల వరకు మాస్కులు, ఫేస్‌షీల్డులు, ఐదు వేల పీపీఈ కిట్లను పంపిణీ చేసినట్లు పేర్కొంది. తూర్పు దిల్లీ నియోజకవర్గంలోని పలు చోట్ల చేతులను శుభ్రం చేసుకునేందుకు 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రిపోర్ట్‌ కార్డులో గంభీర్‌ వెల్లడించారు. 2019 సాధారణ ఎన్నికల్లో భాజపా తరఫున తూర్పు దిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గౌతం గంభీర్‌ దాదాపు 50 శాతం ఓట్లను సాధించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని