హైదరాబాద్‌కు తెరాస చేసిందేమీ లేదు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల అంశంపై చర్చకు మంత్రి కేటీఆర్‌ సిద్ధమా?

Published : 10 Nov 2020 02:23 IST

దిల్లీ: హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల అంశంపై చర్చకు మంత్రి కేటీఆర్‌ సిద్ధమా? అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం లేదంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. భాజపా తెలంగాణలో విస్తరిస్తోందని.. అది తట్టుకోలేకే తెరాస నేతలు ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మణ్‌ అన్నారు. భాజపా ఎదుగుదలను తట్టుకోలేని తెరాస.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేవిధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘‘సీఎం కేసీఆర్‌ కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిచేయలేదు. వందరోజుల్లో నగర రూపురేఖలు మారుస్తామన్న మాటలు ఏమయ్యాయి? హైదరాబాద్‌కు తెరాస చేసిందేమీ లేదు. ఇంటింటికీ నల్లా అని చెప్పి ఇంటింటికీ బురద తెచ్చారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ కార్యకర్తలకు పంచుతున్నారు’’ అని లక్ష్మణ్‌ ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని