బిహార్‌ బరి: భాజపా, ఆర్జేడీ హోరాహోరీ

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. ఆధిక్యంలో ఎన్డీయే, మహాగట్‌ బంధన్‌ కూటమి తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇక భాజపా, రాష్ట్రీయ జనతాదళ్‌ల

Published : 10 Nov 2020 11:26 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. ఆధిక్యంలో ఎన్డీయే, మహాగట్‌ బంధన్‌ కూటమి తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇక భాజపా, రాష్ట్రీయ జనతాదళ్‌ల మధ్య కూడా ఆధిక్యం దోబూచులాడుతోంది. ప్రస్తుతం భాజపా 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆర్జేడీ 65 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ 55, కాంగ్రెస్‌ 26, వామపక్షాలు 17, వీఐపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

ప్రముఖులు ఇలా.. 

మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ రాఘోపూర్‌లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేత శతృఘ్న సిన్హా కుమారుడు, ఆ పార్టీ అభ్యర్థి లవ్‌ సిన్హా బాంకిపూర్‌లో వెనుకబడ్డారు. ఇమామీ గంజ్‌లో హెచ్‌ఐఎం నేత జీతన్‌రాం మాంఝీ, హసన్‌పూర్‌లో ఆర్జేడీ నేత తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, బిహారీగంజ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుభాషిణీ శరద్‌ యాదవ్‌ వెనుకంజలో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని