బిహార్‌లో 9మంది రెబల్స్‌పై భాజపా వేటు

బిహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నెల 28న తొలి విడత ఎన్నికలకు ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఎన్డీయే అభ్యర్థులకు .......

Published : 13 Oct 2020 00:13 IST

పట్నా: బిహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నెల 28న తొలి విడత ఎన్నికలకు ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఎన్డీయే అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన తొమ్మిది మంది నేతలపై భాజపా వేటు వేసింది. వారిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిని ఆరేళ్ల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర చీఫ్‌ సంజయ్‌ జైశ్వాల్‌ ఓ లేఖను విడుదల చేశారు.  

జేడీయూతో పాటు మరో రెండు చిన్న పార్టీలతో కలిసి భాజపా ఎన్నికల బరిలో దిగింది. పొత్తుల్లో భాగంగా భాజపా 115 సీట్లలో పోటీ చేస్తుండగా.. జేడీయూ 110 స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీకి 11,  హిందుస్థానీ అవామ్‌ మోర్చ (సెక్యులర్‌)కు ఏడు స్థానాలు చొప్పున కేటాయించారు. మరోవైపు, ఇటీవలి కాలం వరకు ఎన్డీయే భాగస్వామిగా కొనసాగిన ఎల్జేపీ ఒంటరి పోరుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని