ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు:డీకే అరుణ

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో..

Published : 19 Oct 2020 02:25 IST

హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని.. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ అండర్ గ్రౌండ్‌ పంప్‌హౌజ్‌కే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు.

‘‘రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టం జరిగితే పటించుకొనే వారే లేరు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హైదరాబాద్ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించడం లేదు. ఆయన కనీసం వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే కూడా చేయడం లేదు. వర్షాలతో ఏమేరకు పంట నష్టం జరిగింది.. ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారనే విషయాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు’’ అని ఆరోపణలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని