బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం 

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేయడం దుందుడుకు చర్య అని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అభివర్ణించారు.

Published : 27 Oct 2020 01:01 IST

అమరావతి : భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం దుందుడుకు చర్య అని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అభివర్ణించారు. అరెస్ట్ అప్రజాస్వామికమని, ఈ అరెస్టును ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ పైనా, భాజపా నాయకులపైనా పోలీసుల చర్యలు సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఉద్రిక్తతలకు తావిచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపచేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. పోటీలో ఉన్న భాజపా అభ్యర్థినీ, శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం గర్హనీయమని పవన్‌ ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని