ఇదే దూకుడుతో వెళ్లాలని చెప్పారు: బండి

జీహెచ్‌ఎంసీ ఫలితాలపై రాష్ట్ర నేతలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందించారని.. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే దూకుడుతో వెళ్లాలని ఆయన సూచించారని..

Published : 07 Dec 2020 00:59 IST

దిల్లీ: జీహెచ్‌ఎంసీ ఫలితాలపై రాష్ట్ర నేతలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందించారని.. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే దూకుడుతో వెళ్లాలని ఆయన సూచించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. అమిత్‌షాతో ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణలో అసలైన ఉద్యమకారులను తెరాస విస్మరిస్తోందని.. ఈ వైఖరి కారణంగానే వారు భాజపాలోకి వస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకపాత్ర  షోషించారని, రేపు ఉదయం 11 గంటలకు ఆమె భాజపాలో చేరతారని బండి సంజయ్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని