
ఎన్నికల ముందు మాయావతికి షాక్!
పట్నా: బిహార్ ఎన్నికల వేళ మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు భారత్ బింద్ పార్టీని వీడి ఆర్జేడీలో చేరారు. శనివారం తేజస్వీయాదవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భారత్ బింద్కు సభ్యత్వం తేజస్వీ యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ఆర్జేడీ తన పార్టీ ట్విటర్ ఖాతాలో ఉంచింది.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే, మహా కూటమి కాదని కేంద్రమాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వహ తృతీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఇందులో మాయవతి నేతృత్వంలోని బీఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ (సోషలిస్ట్)లు ఉన్నాయి. ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుష్వహ పేరును మాయవతి ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన రాష్ట్ర అధ్యక్షుడే పార్టీని వీడి ఆర్జేడీలో చేరడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.