ఎమ్మెల్సీ కవితపై భాజపా ఫిర్యాదు

ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన కవిత.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారని లేఖలో

Updated : 24 Sep 2022 14:36 IST

అనర్హత వేటు వేయాలని ఈసీకి లేఖ

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన కవిత.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారని లేఖలో వెల్లడించింది. గతంలో కవిత నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు బోధన్‌ అసెంబ్లీలోని నియోజకవర్గంలో తనకు ఓటు ఉన్నట్లు అఫడవిట్‌లో పేర్కొందని తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్‌ చిరునామాతో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది. ‘‘నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. మీరు బయటకు వచ్చి ఓటేయండి’’ అని కవిత ట్వీట్‌ చేసినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి లేఖలో
ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని