ఇసుకపై త్వరలో ఉద్యమం: సోము వీర్రాజు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ..

Published : 11 Dec 2020 01:21 IST

కడప: రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలో 50శాతానికిపైగా జడ్పీటీసీ, ఎంపీటీసీలను వైకాపా ప్రభుత్వం ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. వాటిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోమువీర్రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఆదుకోవడానికి కేంద్రం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. పోలవరానికి నిధులిచ్చిన తరహాలోనే రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ముందడుగు వేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక బంగారం కంటే ప్రియమైందని అన్నారు. చంద్రబాబు హయాంలో కొంత అవినీతి జరిగినా ఇసుక మాత్రం లభ్యమయ్యేదని.. వైకాపా పాలనలో ఇసుక దొరకడమే గగనమైపోయిందని విమర్శించారు. ఇసుకపై త్వరలోనే భాజపా ఉద్యమం చేపడుతుందని సోము వీర్రాజు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు