రాష్ట్రంలో మళ్లీ అనాగరిక పాలన: చంద్రబాబు

అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే ఎస్సీ యువకుడిని చిత్రహింసలకు గురి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు..

Published : 22 Jul 2020 02:06 IST

అమరావతి: అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే ఎస్సీ యువకుడిని చిత్రహింసలకు గురి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత లోకేశ్‌ విమర్శించారు. పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడికి శిరోముండనం చేయించడం ఘోరమని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ అనాగరిక పాలన వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలపై జగన్‌ ప్రభుత్వ దమనకాండ కొనసాగుతోందన్నారు. వైద్యులు సుధాకర్‌, అనితారాణితోపాటు, న్యాయమూర్తి రామకృష్ణపైనా భౌతిక దాడులకు పాల్పడినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని