ఆ ఘటనలపై సీబీఐ విచారణ కోరాలి:చంద్రబాబు

వైకాపా పాలన ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు భంగం కలిగించేలా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. నిరంకుశ పాలనతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తు్న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్వేది, కె.బిట్రగుంటలో పవిత్ర ...

Published : 10 Sep 2020 01:37 IST

అమరావతి: వైకాపా పాలన ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు భంగం కలిగించేలా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. నిరంకుశ పాలనతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తు్న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్వేది, కె.బిట్రగుంటలో పవిత్ర రథాలను దహనం చేశారని.. పిఠాపురంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందని మండిపడ్డారు. తిరుమలలో ఏకంగా తితిదే అధికారులే అన్యమత ప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు. సింహాచలం ఆలయ బోర్డును అక్రమంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ ఘటనలకు ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వరద బాధితులకు పునరావాసం కల్పించడంలోనూ వైకాపా నేతలు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు. వైకాపా దాడులు, దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. నియంతలంతా కాలగర్భంలో కలిసిపోయారన్నారు. మంత్రులను వరద బాధితులే నిలదీయం పరాకాష్ఠ అని.. గాడితప్పిన నేతలను ప్రజలే నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని