నిలదీసిన వారిపై దాడులు పెరిగాయి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలో వైకాపా షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారని.. భూములు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారని తెదేపా

Updated : 11 Oct 2020 05:08 IST

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలో వైకాపా షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారని.. భూములు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయనగరం పార్లమెంటు తెదేపా నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అక్రమ వసూళ్ల దందా చేస్తూ అన్ని వర్గాలను పీడిస్తున్నారని ఆరోపించారు. దందాపై నిలదీసిన వారిపై బెదిరింపులు, దాడులు పెరిగాయన్నారు. ప్రజల నుంచి జె ట్యాక్స్‌, వైకాపా ట్యాక్స్‌, గవర్నమెంట్‌ ట్యాక్స్‌ వసూలు  చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని చెడగొట్టే పాలకులను ఇప్పుడే చూస్తున్నాం అని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలోని 20 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అక్టోబరు రెండో వారం వచ్చినా కరవు మండలాల ప్రకటన చేయలేదని.. పంటలు తగులబెట్టే పరిస్థితి రైతులకు తీసుకొచ్చారని చంద్రబాబు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని