‘నెల్లూరులో సంగీత వర్సిటీ ఏర్పాటు చేయండి’

అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని

Updated : 27 Sep 2020 17:24 IST

ఎస్పీ బాలు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలి
ఏపీ సీఎం జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

అమరావతి: అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఏటా ఎస్పీబీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని.. సంగీత వర్సిటీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని  కోరారు. ఆ ప్రాంతాన్ని బాలు కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. 

ఎస్పీ బాలు పేరిట జాతీయ పురస్కారాన్ని అందించాలని.. ప్రభుత్వ సంగీత అకాడమీకి ఆయన పేరు పెట్టాలని చంద్రబాబు సూచించారు. లలిత కళలకు ప్రోత్సాహం అందించడంపైనా లేఖలో ప్రస్తావించారు. సంగీతం, లలిత కళల్లో యువతరాన్ని ప్రోత్సహించడం ద్వారా బాలు కలనెరవేర్చాలన్నారు. ప్రాచీన తెలుగు కళా సారస్వతాన్ని గౌరవించడం ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను సమున్నత స్థాయిలో నిలబెట్టడమే బాలసుబ్రహ్మణ్యంకు మనం అందించే నిజమైన నివాళి అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు