ఎస్సీలపై దమనకాండకు పెద్దిరెడ్డే కారణం: బాబు

చిత్తూరులో తెదేపా నేతల గృహ నిర్భందాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తెదేపా నేతలు ఒత్తిడి చేయడం వల్లే ప్రతాప్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారన్నారు.

Updated : 29 Aug 2020 21:12 IST

చిత్తూరు: చిత్తూరులో తెదేపా నేతల గృహ నిర్భందాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తెదేపా నేతలు ఒత్తిడి చేయడం వల్లే ప్రతాప్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారన్నారు. పార్టీ ఎస్సీ నాయకులతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మృతుడి సెల్‌ఫోన్‌ లాగేస్కోవడం, శవపరీక్ష జరపడం, హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ఈ కేసులో కీలకమైన మృతుడి కాల్‌లిస్టును బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. చౌటుపల్లిలో మరో ఎస్సీ యువకుడి ప్రాణాలు తీసి ట్రాక్టర్‌ బోల్తాపడి మరణించినట్లుగా చిత్రీకరించారని చంద్రబాబు అన్నారు. చిత్తూరులో దళితులపై దమనకాండకు మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలే కారణమని అన్నారు. మూడు నెలల్లో రెండు శిరోముండనం ఘటనలు మానవత్వానికే సిగ్గు చేటని విమర్శించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని