వారెందుకు ఇంగ్లీషు నేర్చుకోరు?

తమిళనాడు ఎంపీ కనిమొళికి చెన్నై విమానాశ్రయంలో ఎదురైన చేదు అనుభవం సాధారణమేనని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం అన్నారు. హిందీ కాకుండా ఆంగ్లం లేదా

Published : 10 Aug 2020 13:11 IST

కనిమొళికి వత్తాసు పలికిన చిదంబరం

దిల్లీ: తమిళనాడు ఎంపీ కనిమొళికి చెన్నై విమానాశ్రయంలో ఎదురైన చేదు అనుభవం సాధారణమేనని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం అన్నారు. హిందీ కాకుండా ఆంగ్లం లేదా తమిళంలో మాట్లాడాల్సిందిగా చెన్నై విమానాశ్రయ సిబ్బందిని కోరినందుకు, వారు డీఎంకే ఎంపీ భారతీయతపై సందేహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘డీఎంకే ఎంపీ కనిమొళికి ఎదురైన చేదు అనుభవం అసాధారణమైనది కాదు. ప్రభుత్వాధికారుల నుంచి, సామాన్యుల వరకూ.. పలువురి వల్ల నేను కూడా అటువంటి అనుభవాలను ఎదుర్కొన్నాను. ఫోన్‌ సంభాషణల్లో, ముఖాముఖి మాట్లాడేటప్పుడు కూడా  హిందీలో మాట్లాడాల్సిందిగా వారు నన్ను అనేకసార్లు కోరారు’’ అని చిదంబరం అన్నారు.

కేంద్రం నిజంగానే హిందీ, ఇంగ్లిష్‌ రెండింటినీ అధికారక భాషలుగా భావిస్తూంటే.. అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఆ రెండు భాషలు వచ్చిఉండాలనే నిబంధన పెట్టాలన్నారు. కేంద్ర ఉద్యోగాల్లో నియమితులైన హిందీయేతరులు, అతి తక్కువ సమయంలోనే హిందీలో కనీస పరిజ్ఞానం సంపాదిస్తున్నపుడు, హిందీ మాట్లాడేవారు ఇంగ్లిష్‌ ఎందుకు నేర్చుకోలేరని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని