జమ్మలమడుగు వైకాపాలో విభేదాలు

కడప జిల్లా జమ్మలమడుగు వైకాపాలో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశమైంది

Published : 14 Dec 2020 01:46 IST

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరోవర్గం సమావేశం

మైలవరం: కడప జిల్లా జమ్మలమడుగు వైకాపాలో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశమైంది. మైలవరం మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి, గన్నవరం శేఖర్‌రెడ్డి, జమ్మలమడుగు మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ జగదేక‌రెడ్డి, మూలే సుప్రియ తదితరులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భేటీ అయ్యారు. సుధీర్‌రెడ్డి నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరిగే విధంగా కృషి చేయాలన్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూనే నష్టం జరిగేలా వ్యవహరించేవారిని సహించేదిలేదని నేతలు చెప్పారు. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని