కాంగ్రెస్‌ నుంచి మరిన్ని ఫిరాయింపులు : రూపానీ

కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే పడవ అని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ అన్నారు. నవంబర్‌ 3న రాష్ట్రంలో ఎనిమిది సీట్లకు ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి మరిన్ని ఫిరాయింపులు ఉంటాయని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వల్సాద్‌...........

Published : 26 Oct 2020 23:15 IST

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే పడవ అని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ అన్నారు. నవంబర్‌ 3న రాష్ట్రంలో ఎనిమిది సీట్లకు ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి మరిన్ని ఫిరాయింపులు ఉంటాయని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వల్సాద్‌ జిల్లా కప్రాడ నియోజవకర్గంలో భాజపా అభ్యర్థి జితు చౌధురికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ రూపానీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ విచ్ఛిన్నమవుతోందని, అది మునిగిపోయే పడవగా మారిందన్నారు. కార్యకర్తలకు సైతం ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం ఉండటంలేదని విమర్శించారు. రాహుల్‌ గాంధీ సమర్థతపైనా ప్రశ్నలు వస్తున్నాయని, వారసత్వ రాజకీయాల నుంచి కార్యకర్తలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని రూపానీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజలకు ఏ పనీ చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. జితు చౌధురి కూడా తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే భాజపాలోకి వచ్చి చేరారని తెలిపారు. 2017లో 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడగా.. 2018లో ఆరుగురు, తాజాగా ఎనిమిది మంది ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారని వివరించారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి ఫిరాయింపులకు పాల్పడి భాజపా అభ్యర్థికి మద్దతు తెలిపారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో నవంబర్‌ 3న ఇక్కడ ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని