Published : 14 Dec 2020 01:49 IST

విమానాశ్రయాలు కాదు.. రోడ్లు కావాలి:జీవన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు విలాసవంతమైన విమానాశ్రయాలు కాకుండా సౌకర్యవంతమైన రహదారులు అవసరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి గురించి కాకుండా విమానాశ్రయాలపై సీఎం కేసీఆర్‌ ప్రస్తావించడంపై జీవన్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు ఉండేలా రహదారులు నిర్మిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం జరిగిన తరువాత ఎలా జాతీయ హోదా అడుగుతారని నిలదీశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసకు జరిగిన నష్టాన్ని గుర్తించిన కేసీఆర్‌.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నందునే వరద బాధితులకు రూ.10వేలు పరిహారం ఇచ్చారని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడం లేదని.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ తన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చుకున్నారని.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం నిరాశే మిగిల్చారని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని