సచిన్‌ పైలట్‌తో కాంగ్రెస్‌ ముఖ్య నేతల చర్చలు

రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. అసంతృప్తితో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌.....

Published : 10 Aug 2020 22:28 IST

జైపూర్‌: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. అసంతృప్తితో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ తిరిగి కాంగ్రెస్‌లోనే కొనసాగేందుకు సుముఖత వ్యక్తంచేయడంతో చర్చలు మొదలయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో సచిన్‌ పైలట్‌, సహచర ఎమ్మెల్యేలతో పార్టీ అగ్రనేతలు చర్చలు చేపట్టారు. ఈ చర్చల్లో రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌, అహ్మద్‌ పటేల్‌ పాల్గొన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రియాంకా గాంధీ వాద్రా, అహ్మద్‌ పటేల్‌, కేసీ వేణుగోపాల్‌ ఉన్నారు. 

అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్‌ పైలట్‌ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ సర్కార్‌ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని