Published : 30 Aug 2020 01:58 IST

వాట్సాప్‌ కూడా వారి చేతుల్లోనే ఉంది..

జుకర్‌బర్గ్‌కు రెండోసారి కాంగ్రెస్‌ నాయకుల లేఖ

దిల్లీ: అధికార పక్షం భాజపా వైపు ఫేస్‌బుక్‌ ఇండియా మొగ్గు చూపుతుందన్న అంశంపై.. ఆ సంస్థ ఏ చర్యలు తీసుకుందో వివరించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఫేస్‌బుక్‌కు మరోసారి లేఖ రాశారు. భారతదేశంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఏం చేస్తున్నారో చెప్పాలంటూ ఆయన సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌ ఆధీనంలో ఉన్న మరో సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌ కూడా.. భాజపా కనుసన్నల్లోనే నడుస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పాలకులపై పక్షపాతం చూపుతున్నారంటూ కాంగ్రెస్‌, ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లేఖ రాయటం ఇటీవలి కాలంలో రెండోసారి. అంతేకాకుండా భాజపా వాట్సాప్‌ను ద్వేషపూరిత భావజాల ప్రచారానికి వాడుకునేలా ఫేస్‌బుక్‌ అనుమతిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ సోషల్‌ మీడియా దిగ్గజం, భారత్‌లో భాజపా అనుకూల విధానం అనుసరించటం పట్ల విచారణ జరిపించాల్సిందిగా జుకర్‌బర్గ్‌ను కోరుతూ ఆగస్టు 18న ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా, 400 మిలియన్ల భారతీయులు వాడుతున్న వాట్సాప్‌ను భాజపా పరోక్షంగా తన ఆధీనంలోకి తీసుకుందనే ఆరోపణలపై జవాబు చెప్పాలని వేణుగోపాల్‌ తాజా లేఖలో కోరారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని