కార్పొరేట్‌ ఆసుపత్రులను నియంత్రించాలి: చాడ

కొవిడ్‌ చికిత్స పేరిట భారీగా వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్‌ ఆసుపత్రులను నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు దవాఖానాలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం

Published : 31 Jul 2020 17:05 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ చికిత్స పేరిట భారీగా వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్‌ ఆసుపత్రులను నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు దవాఖానాలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం మీడియాతో చాడ మాట్లాడుతూ... రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రిలో నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో అవుట్‌ సోర్సింగ్‌ నర్సులు ఆందోళన చేస్తున్నారని.. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకోవాలని చాడ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని