కమల్‌నాథ్‌కు ఈసీ షాక్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎంకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. ఉప ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి ఆయన్ను తప్పించింది. ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో .............

Published : 30 Oct 2020 20:30 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఉప ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి ఆయన్ను తప్పించింది. ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదే పదే ఉల్లంఘిస్తున్నారని, తమ హెచ్చరికలను సైతం విస్మరించారని మండిపడింది. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆయన్ను అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఇకపై ఆయన ఏ నియోజకవర్గంలోనైనా ప్రచారానికి వెళ్తే కమల్‌నాథ్‌ ప్రయాణ ఖర్చులు, వసతి తదితర ఖర్చులన్నీ సంబంధిత అభ్యర్థులే భరించాలని ఆదేశించింది.

ఇటీవల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా భాజపా మహిళా అభ్యర్థిని అభ్యంతరక పదంతో సంబోధించడం వివాదానికి దారితీసింది. దీనిపై ఈసీ ఆయన్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబావుటా ఎగరవేయడంతో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సింథియా కలిసి కమలదళంలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని