గ్రేటర్‌లో ముగిసిన ప్రచార గడువు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో ఆయా పార్టీ అభ్యర్థుల మైకులన్నీ ఈ సాయంత్రం 6 గంటల తర్వాత మూగబోయాయి.

Published : 29 Nov 2020 18:00 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో ఆయా పార్టీ అభ్యర్థుల మైకులన్నీ ఈ సాయంత్రం 6 గంటల తర్వాత మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మరోసారి గ్రేటర్‌ పీఠం నిలబెట్టుకోవాలని అధికార తెరాస భావిస్తుండగా, ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని భాజపా కృతనిశ్చయంతో ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. 

డిసెంబరు 1న గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపనున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, పార్టీల నేతలు, కార్యకర్తలు గడువు సమయంలోపే జీహెచ్‌ఎంసీ పరిధిని వదిలి వెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్‌ రోజు (డిసెంబరు 1) సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని