బిహార్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుదిదశ పోలింగ్‌ మొదలైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇంతవరకు రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్‌ నిర్వహించారు. మూడోదశలో మిగిలిన 78 స్థానాలకు ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభించారు. చివరి విడత పోలింగ్‌లో 2 కోట్ల మందికి పైగా ఓటర్లు 1,200 మందికి పైగా అభ్యర్థుల...

Updated : 07 Nov 2020 12:44 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుదిదశ పోలింగ్‌ మొదలైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్‌ నిర్వహించారు. మూడోదశలో మిగిలిన 78 స్థానాలకు ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. చివరి విడత పోలింగ్‌లో 2 కోట్ల మందికి పైగా ఓటర్లు 1,200 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 1,23,799 మంది పురుషులు, 12,06,378 మంది మహిళలు  తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.

బరిలో ప్రముఖులు వీరే
జేడీయూ తరఫున అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ చౌధరీతో పాటు 8 మంది మంత్రులు, భాజపాకు చెందిన మరో నలుగురు మంత్రులు బరిలో ఉన్నారు. శరద్‌ యాదవ్‌ కుమార్తె సుభాషిణి యాదవ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

ఎంఐఎం ప్రభావం
మూడోదశ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కోసి-సీమాంచల్‌ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ పలు స్థానాల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆయాచోట్ల హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం కూడా అభ్యర్థులను నిలిపింది. దీంతో ఎన్‌డీయే-మహాకూటమి అభ్యర్థుల గెలుపోటములపై ఎంఐఎం ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మాజీ ఎంపీ, జన్‌ అధికార్‌ పార్టీ అధినేత పప్పు యాదవ్‌కు కూడా పలుచోట్ల పట్టుంది. దీంతో ఆర్జేడీ తమకు అనుకూలమని భావిస్తున్న సామాజికవర్గ ఓటర్లను పప్పుయాదవ్‌ ఆకర్షించే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఎల్‌జేపీ కూడా బరిలో ఉండగా.. జేడీయూపై ఆ పార్టీ ప్రభావం ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు