మళ్లీ అధికారం కోసం నితీశ్‌ అలా కూడా చేస్తారు : చిరాగ్‌ 

బిహార్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవసరమైతే మరోసారి అధికారం కోసం సీఎం నితీశ్‌ కుమార్‌ మహాకుటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌ ముందు తల వంచడానికి కూడా వెనకాడరని ఎల్జేపీ(లోక్‌ జనశక్తి పార్టీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. గురువారం నిర్వహించిన

Published : 05 Nov 2020 14:51 IST

పట్నా : బిహార్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవసరమైతే మరోసారి అధికారం కోసం సీఎం నితీశ్‌ కుమార్‌ మహాకుటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌ ముందు తల వంచడానికి కూడా వెనకాడరని ఎల్జేపీ(లోక్‌ జనశక్తి పార్టీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నితీశ్‌ కుమార్‌ గతంలో ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని గుర్తు చేశారు. అధికారం కోసం మళ్లీ నితీశ్‌ మళ్లీ మోదీ పంచకే చేరారని చిరాగ్‌ పేర్కొన్నారు. ఇది ఆయనకు అధికారంపై ఉన్న దురాశను తెలియజేస్తుందని యువ నాయకుడు తెలిపారు. మద్య నిషేధానికి సంబంధించిన కేసులో దర్యాప్తు పూర్తి అయితే నితీశ్‌ జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ సభలో మాట్లాడుతున్న నితీశ్‌పై నిరసనకారులు ఉల్లిగడ్డలు విసిరారు. ఈ చర్యను ఖండించిన చిరాగ్‌ ప్రజలు అడిగే ప్రశ్నలను దాటవేయకుండా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. 

బిహార్‌లో రెండు ఇంజిన్ల ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ సీఎం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని చిరాగ్‌ విమర్శించారు. బిహార్‌ నుంచి వలసలను అరికట్టాలంటే నితీశ్‌కు ఓటు వేయొద్దని ఆ రాష్ర్ట ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.  ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మూడు విడతల పోలింగ్‌ నేపథ్యంలో ఆ రాష్ర్టంలో ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. నవంబంరు 7న మూడో దశ పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.   

 

   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని