తరుణ్‌ గొగొయ్‌కి కరోనా పాజిటివ్‌

అసోంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో 94వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.......

Published : 26 Aug 2020 19:59 IST

గువాహటి: అసోంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో 94వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరుణ్‌ గొగొయ్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. 85 ఏళ్ల గొగోయ్‌ నిన్న కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు.  గత కొద్ది రోజులుగా తనను కలిసినవారు తక్షణమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కొన్ని రోజుల నుంచి స్వల్పంగా దగ్గు, జలుబు ఉన్నట్టు సమాచారం. గొగోయ్‌కి కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, అందువల్ల ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు పార్టీ నేతలు తెలిపారు. వయస్సు రీత్యా అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకొని ఆస్పత్రిలో చేరుస్తామని తెలిపారు. 

గొగొయ్‌కి కరోనా సోకడంపై రాష్ట్ర వైద్యశాఖమంత్రి హిమంత బిశ్వశర్మ ట్విటర్‌లో స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు చికిత్స అందించేందుకు వీలుగా వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని ట్విటర్‌లో వెల్లడించారు. అసోంలో నిన్న ఒక్కరోజే 1973 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 94,592కి చేరింది. వీరిలో 74,814 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 260మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 19518 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని