ఆ ఒక్కస్థానం మినహా ‘గ్రేటర్‌’ లెక్కింపు పూర్తి

జీహెచ్‌ఎం ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా అన్నిచోట్లా ఫలితాలు వెల్లడి పూర్తయింది. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడ స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువగా ఉండటంతో లెక్కింపు

Updated : 24 Sep 2022 14:33 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎం ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా అన్నిచోట్లా ఫలితాలు వెల్లడి పూర్తయింది. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడ స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువగా ఉండటంతో లెక్కింపు నిలిపివేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)కి పంపినట్లు ఆర్వో తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నేరేడ్‌మెట్‌ ఓట్ల లెక్కింపుపై నిర్ణయం తీసుకుంటాన్నారు. ఆ డివిజన్‌లో  తెరాస-భాజపా మధ్య పోటీ నడుస్తోంది. నేరేడ్‌మెట్‌ మినహా మిగిలిన 149 స్థానాల్లో లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు వెల్లడించారు. తెరాస 55, భాజపా 48, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ 2 స్థానాల్లో విజయం సాధించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని