‘గ్రేటర్‌’ ఎగ్జిట్‌పోల్స్‌.. ఏ పార్టీకి ఆధిక్యమంటే!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఓల్డ్‌ మలక్‌పేటలో వాయిదా

Updated : 24 Sep 2022 14:35 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఓల్డ్‌ మలక్‌పేటలో వాయిదా పడిన పోలింగ్‌ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన ఆరా, జన్‌కీ బాత్‌ సంస్థలు తెరాసకు మెజార్టీ స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి.

ఆరా సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం.. తెరాసకు 71-85 స్థానాలు (40.08 శాతం ఓట్లు), ఏఐఎంఐఎం 36-46 స్థానాలు (13.43 శాతం), భాజపా 23-33 స్థానాలు (31.21 శాతం), కాంగ్రెస్‌ 0-6 స్థానాలు (8.58 శాతం) కైవసం చేసుకోనున్నాయి. ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌ ఆధారంగా తెరాస, భాజపా మధ్య 9 శాతం ఓట్ల వ్యత్యాసం కనపడుతోంది. ఇతరులకు 7.70 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

మరో సంస్థ జన్‌కీ బాత్‌ వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ తెరాస అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెరాసకు 67-77 స్థానాలు (37.4 శాతం ఓట్లు), ఏఐఎంఐఎం 39-43 స్థానాలు (21 శాతం), భాజపా 24-42 స్థానాలు (33.60 శాతం), ఇతరులు 2 నుంచి 5 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీకి 4.2 శాతం ఓట్లు సాధించేందుకు అవకాశం ఉన్నట్లు వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని