తెదేపా పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ రాజీనామా

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలి పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు.

Updated : 01 Oct 2020 16:12 IST

అమరావతి: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలి పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న గల్లా అరుణకుమారి.. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన ఆమె.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018లో ఆమెను పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా చంద్రబాబు నియమించారు. గల్లా అరుణకుమారి తనయుడు జయదేవ్‌ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నుంచి విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు