ఆ ఒప్పందంపై ఎందుకు జోక్యం చేసుకోరు?:గల్లా

విద్యుత్‌ ఒప్పందాల(పీపీఏ) విషయంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాజధాని నిర్మాణంపై అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని

Published : 24 Oct 2020 02:08 IST

 

గుంటూరు: విద్యుత్‌ ఒప్పందాల(పీపీఏ) విషయంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాజధాని నిర్మాణంపై అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నించారు. గుంటూరులో పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజధానిపై జోక్యంచేసుకునే హక్కు పార్లమెంట్‌కు ఉందన్నారు. రాజ్యాంగంలోని 248వ అధికరణలో ఈ అంశం స్పష్టంగా ఉందనే విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలిపామని చెప్పారు. ఈ వ్యవహారంలో విఫలమైతే ఎక్కడా రైతులు ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి ఉండదని గల్లా జయదేవ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు