గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ

తెలంగాణ శాసనమండలిలో రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. గవర్నర్‌

Published : 14 Nov 2020 01:31 IST

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. గవర్నర్‌ కోటా కింద ఖాళీ అయిన మూడు స్థానాలకు ప్రముఖ ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్‌ పేర్లను ఖరారు చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు పేర్లతో ఖరారు చేసిన జాబితాను ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంపింది. గవర్నర్‌ ఆమోదం అనంతరం వారితో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మరోవైపు ఎమ్మెల్సీలుగా ఖరారైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్‌ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తమను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని