కరెంటు మీటరా? కారు మోటరా? తేల్చుకోండి

వ్యవసాయ బోర్ల వద్ద కరెంటు మీటరా? 24 గంటల పాటు ఉచిత కరెంటా? ప్రజలే నిర్ణయించుకోవాలని తెరాస సీనియర్‌ నేత, మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 12 Oct 2022 15:57 IST

ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు

దుబ్బాక: వ్యవసాయ బోర్ల వద్ద కరెంటు మీటరా? 24 గంటల పాటు ఉచిత కరెంటా? ప్రజలే నిర్ణయించుకోవాలని తెరాస సీనియర్‌ నేత, మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో భాగంగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. రేపటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో ఉదయం నుంచే గ్రామాల్లో ప్రచారం హోరెత్తుతోంది. రాయపోల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన హరీశ్‌రావు భాజపాపై మండిపడ్డారు. అసత్యాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘భాజపాకు ఓటేస్తే ఏమిస్తారట అంటే.. బోర్ల వద్ద మీటర్లు ఇస్తారట.ఏపీ సీఎం జగన్‌  ఒప్పుకొని బోర్ల వద్ద మీటర్లు పెట్టడం షురూ చేశారు. మన సీఎం కేసీఆర్‌ మాత్రం నేను పెట్టను.. మాది రైతు ప్రభుత్వం.. పైసలు ఇవ్వకపోయిన ఫర్వాలేదు.. నేను మాత్రం మా బోరువద్ద రైతులకు 24 గంటల కరెంటు ఇస్తానంటున్నారు. ఏ దిక్కున ఉండాలి మనం’’ అని ఓటర్లను ఉద్దేశించి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని