మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలి

రాజకీయ నాయకుల్ని చట్టవిరుద్ధంగా బందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అధికరణ 370 రద్దు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.........

Published : 03 Aug 2020 01:21 IST

దిల్లీ: రాజకీయ నాయకుల్ని చట్టవిరుద్ధంగా బంధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 370 అధికరణం రద్దు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కశ్మీర్‌లో నేతల్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. దాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ గృహనిర్బంధంలోనే ఉన్న పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

2019, ఆగస్టు 5న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెహబూబా ముఫ్తీని నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెపై ప్రజా భద్రతా చట్టం ప్రయోగించారు. గడువు ముగియడంతో మరో మూడు నెలలు పొడిగిస్తూ శుక్రవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ తాజా వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని