Published : 28 Oct 2020 15:25 IST

తొలి విడత ఎన్నికల్లో 50 సీట్లు మావే: మాంఝీ

పట్నా: బిహార్‌లో తొలి విడతగా 71 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 50 స్థానాలు ఎన్డీయే కూటమే గెలుచుకుంటుందని మాజీ సీఎం, హిందుస్థానీ ఆవామ్‌ మోర్చ అధినేత జితిన్‌రామ్‌ మాంఝీ అన్నారు. బుధవారం ఆయన గయలోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి, సీనియర్‌ భాజపా నేత గిరిరాజ్‌సింగ్‌ తన ఓటును లఖిసరయిలో వేశారు. అలాగే, పలువురు మంత్రులు తమ ఓటు హక్కును తమ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాంఝీ మాట్లాడుతూ.. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 71 స్థానాల్లో ఎన్డీయే కూటమి 50 స్థానాలను  కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. జితిన్‌రాం మాంఝీ ఈ ఎన్నికల్లో ఎన్డీయేతో జట్టుకట్టిన విషయం తెలిసిందే.

మరోవైపు, తొలి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. 71స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 1.30గంటల సమయానికి 31.54శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ విడతలో వెయ్యి మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలో ఉన్న 71 స్థానాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటివరకు అత్యధిక పోలింగ్‌ లఖిసరయిలో 40.16శాతం నమోదైంది. ఆ తర్వాత నవాడలో 38.08శాతం, పట్నా, జముయి, భగల్పూర్‌లలో 34శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని