మీ త్యాగాలు వృథా కావు: నడ్డా

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో ముగ్గురు భాజపా యువనేతలను హత్య చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. వారి త్యాగాలు వృథా కావని అన్నారు. నేరస్తులకు కచ్చితంగా శిక్షపడుతుందని తెలిపారు. బీజేవైఎం కుల్గాం జనరల్‌ సెక్రెటరీ ఫిదా హుస్సేన్‌,  కార్య నిర్వాహక సభ్యులు ఉమర్‌ రషీద్‌, ఉమర్‌ ఆజాంలను...

Published : 31 Oct 2020 00:51 IST

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో ముగ్గురు భాజపా యువనేతలను హత్య చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. వారి త్యాగాలు వృథా కావని అన్నారు. నేరస్థులకు కచ్చితంగా శిక్షపడుతుందన్నారు. బీజేవైఎం కుల్గాం జనరల్‌ సెక్రెటరీ ఫిదా హుస్సేన్‌,  కార్య నిర్వాహక సభ్యులు ఉమర్‌ రషీద్‌, ఉమర్‌ ఆజాంలను కొందరు అనుమానిత ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నట్లు  పోలీసులు వెల్లడించారు. ‘‘ముగ్గురు భాజాపా యువనేతలను ఉగ్రవాదులు చంపడం చాలా దురదృష్టం. దేశం అలాంటి నేతలను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. యావత్‌ భారతదేశం వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని నడ్డా ట్వీట్‌ చేశారు.

గురువారం సాయంత్రం కొందరు అనుమానిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో యువనేతలు ముగ్గురూ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు స్పందించి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనను భాజపా తీవ్రంగా ఖండించింది. నేరస్థులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేంది లేదని హెచ్చరించింది. నేషనల్ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) పీపుల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) నేతల ప్రోద్బలంతోనే ఈ హత్యలు జరిగాయని రాష్ట్ర భాజపా ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని