వారిపై కోపంలేదని సోనియా చెప్పారు: సూర్జేవాలా

పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని సీడబ్ల్యూసీ కోరిందని కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా వెల్లడించారు. .......

Published : 24 Aug 2020 21:41 IST

దిల్లీ: పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని సీడబ్ల్యూసీ కోరిందని కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా వెల్లడించారు. ఏడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీనియర్లు రాసిన లేఖపై చర్చించినట్టు తెలిపారు. ఇద్దరూ దిల్లీలో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ అనేది పెద్ద కుటుంబమని, అభిప్రాయ భేదాలు సహజంగానే ఉంటాయని సూర్జేవాలా అన్నారు. లేఖ రాసిన నేతలపై ఎలాంటి కోపమూ లేదని సోనియా చెప్పారన్నారు. దేశ సమస్యలపై గళం ఎత్తాలని కాంగ్రెస్‌ సభ్యులను ఆమె కోరారని తెలిపారు. అవకాశాన్ని బట్టి ఏఐసీసీ పూర్తి సమావేశం నిర్వహిస్తామనీ.. ఆ సమావేశంలోనే అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని స్పష్టంచేశారు.

20న సోనియా నాకు లేఖ రాశారు!

ఈ నెల 20న సోనియా తనకు లేఖరాశారని కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని కోరినట్టు చెప్పారు.  సంస్థాగత మార్పునకు సీడబ్ల్యూసీ సోనియాకు పూర్తి అధికారం ఇచ్చిందని కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. సీడబ్ల్యూసీ నుంచి సామాన్య కార్యకర్త వరకు తదుపరి అధ్యక్షుడిగా ఉండాలని రాహుల్‌నే కోరుతున్నారని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని