విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం
విజయాలకు గర్వపడమని, అపజయాలకు కుంగిపోమని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: విజయాలకు గర్వపడమని, అపజయాలకు కుంగిపోమని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందిన తర్వాత హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాకలో ఫలితం తాము ఆశించినట్లుగా రాలేదని, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్‌లో ముందుకుపోతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యమన్నారు. ‘‘ దుబ్బాక ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది. భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తాం.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
దుబ్బాక ఎన్నికల ఫలితం అంత సులువుగా తేల్లేదు. భాజపా, తెరాసల మధ్య విజయం దోబూచులాడింది. రౌండ్ రౌండ్‌కూ నరాలు తేగే ఉత్కంఠ నడుమ చివరికి భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలో ఓట్లను లెక్కించగా..మొదటి ఐదు రౌండ్లతో పాటు 8, 9, 11, 20, 22, 23 రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించింది. 6, 7, 10, 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో అధికార తెరాస హవా కొనసాగింది. 12వ రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. మొత్తం 23 రౌండ్లు. భాజపా 12 రౌండ్లలో ఆధిక్యం కనబరిచింది. తెరాస 10 రౌండ్లలో గెలిచింది. ఒక రౌండ్‌లో కాంగ్రెస్ ముందుంది. అయితే భాజపా, తెరాస మధ్య స్వల్వ ఆధిక్యమే ఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై చివరి వరకు స్పష్టత రాలేదు. 23వ రౌండ్‌లో భాజపా 412 ఓట్లు ఆధిక్యం సాధించడంతో అప్పటికే 1058 మెజార్టీతో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రఘునందర్‌రావు 1470 ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tollywood: యాక్టింగ్‌తో అలరించి.. టేకింగ్‌తో మెప్పించి.. రెండు పడవలపై ప్రయాణించిందెవరంటే?
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?