ఆ రెండు రంగాల్లో అద్భుత అవకాశాలు: కేటీఆర్‌

ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో ఫార్మా, లైఫ్‌ సైన్స్‌ రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని.......

Published : 29 Jul 2020 00:51 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో ఫార్మా, లైఫ్‌ సైన్స్‌ రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. కరోనాతో నెలకొన్న సంక్షోభం తర్వాత కూడ ఈ రెండు రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నారు. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. జీనోమ్ వ్యాలీ, వైద్య పరికరాల పార్క్, హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా నిలువబోతోందన్నారు. ప్రస్తుతం కరోనా సంబంధిత మందులు, వ్యాక్సిన్లు తయారీలో హైదరాబాద్ తన ప్రాధాన్యతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని