రేషన్‌ డీలర్లకు బీమా కల్పించాలి: కన్నా

ప్రజా పంపిణీ నుంచి వాలంటరీ వ్యవస్థను తప్పించాలని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు.

Published : 25 Jul 2020 22:28 IST

అమరావతి: ప్రజా పంపిణీ నుంచి వాలంటరీ వ్యవస్థను తప్పించాలని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు. డీలర్లలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. స్వయం ఉపాధి కింద రేషన్‌ డీలర్లు పని చేస్తున్నారని అన్నారు. రేషన్‌ పంపిణీకి సంబంధించి 5 విడతల కమిషన్ విడుదల చేయాలని కోరారు. డీలర్లందరికీ కరోనా బీమా సౌకర్యం కల్పించాలని, బయోమెట్రిక్‌ విధానం రద్దు చేసి వారిని కరోనా బారి నుంచి కాపాడాలని కన్నా డిమాండ్‌ చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని