‘లవ్‌ జిహాద్‌’కు చెక్‌ పెడతాం: యడియూరప్ప

‘లవ్‌ జిహాద్‌’ పేరిట మత మార్పిడులకు పాల్పడే అంశాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడుతామని కర్ణాటక సీఎం యడియూరప్ప అన్నారు. ఈ మేరకు మంగళూరులో...........

Published : 06 Nov 2020 00:31 IST

బెంగళూరు: ‘లవ్‌ జిహాద్‌’ పేరిట మత మార్పిడులకు పాల్పడే అంశాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడుతామని కర్ణాటక సీఎం యడియూరప్ప అన్నారు. ఈ మేరకు మంగళూరులో నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో ‘లవ్‌ జిహాద్‌’ ఘటనలకు సంబంధించిన వార్తలను తరచూ తాను సైతం మీడియాలో చూస్తున్నానని చెప్పారు. ఇదే విషయమై తాను అధికారులతో కూడా మాట్లాడానని చెప్పారు.

ఇతర రాష్ట్రాలు ఏం చేశాయో, చేస్తాయో తెలీదుగానీ తమ ప్రభుత్వం మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటుందని యడియూరప్ప అన్నారు. రాష్ట్రంలోని అమాయక యువతులకు ప్రేమ, డబ్బు ఆశజూపి మత మార్పిడిలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం ఎంత మాత్రం అలాంటివి సహించబోదని చెప్పారు. ఈ తరహా వివాహాలను అడ్డుకునేందుకు ఓ చట్టాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆ రాష్ట్ర హోంమంత్రి బస్వరాజ్‌ బొమ్మై పేర్కొన్న మరుసటి రోజే యడియూరప్ప ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి కూడా అలహాబాద్‌కోర్టు తీర్పును ఉదహరిస్తూ కర్ణాటక ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురాబోతోందని చెప్పారు. వివాహం కోసం మత మార్పిడి చెల్లుబాటు కాదంటూ ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో భాజపా పాలిత రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాలు లవ్‌ జిహాద్‌ అంశంపై తీవ్రంగా స్పందించాయి. వీటికి చెక్‌పెడతామని పేర్కొన్నాయి. తాజాగా ఆ జాబితాలో కర్ణాటక కూడా చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని