ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ..

Updated : 13 Sep 2023 16:10 IST

హైదరాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

అక్టోబర్‌ 10వ తేదీన జరిగిన ఎన్నికలో మొత్తం 823 మంది ఓటర్లలో 24 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వారిలో 8 మంది కోలుకున్నారు. మిగతా 16 మంది బాధితుల్లో 14 మంది పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మరో ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన కవిత 728 ఓట్లు సాధించి ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికలో భాజపాకు 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు 10 ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని