తెరాస కోటను బద్దలు కొట్టారు: కిషన్‌రెడ్డి

దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Published : 11 Nov 2020 01:58 IST

హైదరాబాద్‌: దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెరాస కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టి భాజపాకు విజయం కట్టబెట్టారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా విజయంతో ప్రతి గ్రామంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దుబ్బాక మాదిరిగా ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు కుటుంబ సభ్యులను వేధించారని, ఆయన మామ ఇంటిపై దాడులు చేశారని ఆరోపించారు.  భాజపా అభ్యర్థి ప్రచారానికి వెళ్తే అడుగడుగునా అడ్డుకున్నారని.. అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని మండిపడ్డారు. నాయకులు, అధికారుల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. దుబ్బాక ప్రజలు భాజపాను చేరదీసి ఆశీర్వదించారని.. క్లిష్ట సమయంలో దేశ ప్రజలు భాజపాకు అండగా నిలిచారని కిషన్‌రెడ్డి చెప్పారు. బిహార్ వంటి రాష్ట్రంలో శాంతియుత పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని