
ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!
తెలుసా? ఆ ‘ఒక్క ఓటే’ చరిత్రను మార్చింది
అందరూ స్పందిస్తేనే ప్రజాస్వామ్యానికి భవిత
హైదరాబాద్: ఓటింగ్ డే అంటే హాలిడే అని చాలా మంది ఓటర్లు భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో మారిపోయేది ఏముంటుందిలే అని అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనలు చెబుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు కేవలం 25.34శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సెలవులు రావడంతో కొందరు సొంతూళ్లకు వెళ్లిపోగా.. కరోనా భయంతో ఇంకొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు. కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తున్న అధికారులు.. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సురక్షితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటేద్దాం రండి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుదాం పదండి!
ఇవిగో ఉదంతాలు..
* 1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 శిరచ్ఛేదనంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..
* 1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.
* 1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.
* 1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది
* 1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు.
* 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.
* 1999 ఎన్నికల్లో ఓక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది.
* 2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.
* 2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
* 2016 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జాంబాగ్ డివిజన్లో తెరాస అభ్యర్థి ఎంఐఎం పార్టీ అభ్యర్థి కేవలం ఐదు ఓట్లు తేడాతో విజయం సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!
-
India News
maharashtra crisis: త్వరలో ముంబయికి వెళతాను: ఏక్నాథ్ శిందే
-
General News
TS TET: తెలంగాణ టెట్ ఫలితాల విడుదలకు తేదీ ఖరారు
-
Sports News
Chandrakant Pandit: మధ్యప్రదేశ్ కెప్టెన్ పెళ్లికి రెండు రోజులే సెలవిచ్చా: చంద్రకాంత్ పండిత్
-
Crime News
Hyd News: చీకటి గదిలో బంధించి చిత్రహింసలు.. కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం
-
General News
GHMC: విధుల్లో నిర్లక్ష్యంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆగ్రహం.. 38 మంది ఇంజినీర్ల జీతాల్లో కోత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- ఆవిష్కరణలకు అందలం
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?