రాజస్థాన్‌ ఫోన్‌ట్యాపింగ్‌: వివరణ కోరిన కేంద్ర హోంశాఖ 

రాజస్థాన్‌ రాజకీయం రోజురోజుకీ ఆసక్తిగా మారుతోంది. ఆడియో టేపుల వ్యవహారంపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రంగంలోకి దిగగా.. చట్టవిరుద్ధంగా ఫోన్‌లను ట్యాప్‌ చేశారన్న ఆరోపణలపై.........

Published : 19 Jul 2020 09:40 IST

జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయం రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఆడియో టేపుల వ్యవహారంపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రంగంలోకి దిగగా.. చట్టవిరుద్ధంగా ఫోన్‌లను ట్యాప్‌ చేశారన్న ఆరోపణలపై హోంశాఖ స్పందించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని రాజస్థాన్‌ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కాంగ్రెస్‌ సర్కారును కూల్చివేయడానికి శాసనసభ్యులను ప్రలోభపెట్టే సంభాషణలుగా చెబుతున్న ఆడియో టేపులపై కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే హోంశాఖ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ సర్కారు.. రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతుల్లో రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిందని భాజపా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, టేపుల్లో ఉన్నట్లుగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నించినట్లు అంగీకరింస్తోందని కాంగ్రెస్‌ వాదిస్తోంది.

ఇదీ చదవండి..

ఆడియో టేపులపై ఏసీబీ కేసు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని