ఎవర్ని ఎంపిక చేసినా కలిసి పనిచేస్తాం:జగ్గారెడ్డి

టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడే ఉంటారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఎవర్ని

Published : 15 Dec 2020 02:07 IST

హైదరాబాద్‌: టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడే ఉంటారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఎవర్ని ఎంపిక చేసినా అంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంపై చర్చించేందుకు సోనియా, రాహుల్‌ గాంధీలను కలిసేందుకు ప్రయత్నిస్తు్న్నామని.. అనుమతి రాగానే దిల్లీ వెళ్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువైందన్నారు. ఓటు, డబ్బు అనే నినాదాన్ని తెరాస తెచ్చిందని.. సిద్ధాంతాలను నమ్మే పార్టీ అని చెప్పుకొనే భాజపా కూడా గ్రేటర్‌ ఎన్నికల్లో డబ్బు రాజకీయం చేసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదన్నారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లో ఆర్థిక పరిపుష్ఠి కలిగిన నేతలు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. పీసీసీ అధ్యక్ష ఎన్నిక తర్వాత ఆర్థికబలంతో కాంగ్రెస్‌ ఎన్నికలు వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని